Jeevajalama Athmanaadhudaa
జీవజలమా ఆత్మనాథుడా
జీవజలమా ఆత్మనాథుడా – ఎండని నదిలాగా రమ్ము బోధకా (2)
రండయ్యా బోధకుడా.. (2)
ఎండని జీవనదిలాగా.. (2)
1. పాదాల కొలత సరిపోదయ్యా – మోకాళ్ల లోతు సరికాదయ్యా (2)
ఈతలా మునిగి లేవాలయ్యా (2)
తేలి తేలి ఆడాలయ్యా (2)
||రండయ్యా బోధకుడా||
2. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే – పారు చోటెల్లా పరిశుద్ధమే (2)
చేరు దాపంతా సంతృప్తియే (2)
నిలుచు మేరంతా పుష్టికరమే (2)
||రండయ్యా బోధకుడా||
3. కోట్లకోట్ల జాలర్ల గుంపు – పరుగు పరుగున వల వేయాలి (2)
పాడి పాడి చేపలు పట్టి (2)
పరమ దేవునికి ప్రజను చేర్చాలి (2)
||రండయ్యా బోధకుడా||
4. ఒడ్డున చెట్లు విస్తారంగా – పండ్లు ఇవ్వాలి ధారాళంగా (2)
ఔషధమవ్వాలి ఆకులన్నీ (2)
ఆహారమవ్వాలి పండులన్నీ (2)