Jayinchina yesayya

జయించిన యేసయ్య నీ తోడు చాలు

జయించిన యేసయ్య నీ తోడు చాలు
బలహీనతలో నీ కృప చాలు (2)
లోకమంత ఒకటై నను వేరుచేసినా
అక్షయతను కోరే నీ చెలిమి చాలు (2)

నీతోడు చాలయ్యా – నాకు నీ కృప చాలయ్యా (2)
పాపలోక అగాధాలలో పడనీయక చేయి పట్టి
స్వార్ధ ప్రియుల లోకములో స్నేహబంధమైనావు (2)
ప్రేమ చూపే ప్రాణేశ్వరుడా నిన్ను మరువలేను
నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను (2)

॥ జయించిన ॥

అంధకార లోకమందు నా వెలుగు దీపమై
హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైనావు (2)
ఆదుకున్న ఆశ్రయుడ నిన్ను మరువలేను
నీతోడు లేకుండ నేను బ్రతుకలేను.(2)

॥ జయించిన ॥

నీళ్ళు లేని ఎడారిలో జీవజలము నీవై
నిలువ నీడలేని నాకు నిత్య నివాసమైనావు (2)
నీడనిచ్చిన నిఖిలేశ్వరుడా నిన్ను మరువలేను
నీతోడు లేకుండ నేను బ్రతుకలేను. (2)

॥ జయించిన ॥