Jagamulanele Paripaalaka
జగములనేలే పరిపాలక
జగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్రగానము
పాడెద నిరతము ప్రేమగీతము
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
||జగములనేలే ||
చరణం :- 1
మహారాజుగా నా తోడువై
నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పాయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము
ఎన్నడు నను విడదే (2)
నీ సన్నిధిలో పొందిన మేలు
తరగని సౌభాగ్యమే (2)
||యేసయ్య యేసయ్య ||
చరణం :- 2
సుకుమారుడా నీ చరితము
నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా
నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభ తరుణం
నాకిది నీ భాగ్యమా (2)
జీవితమంతా నీకర్పించి
నీ రుణము నే తీర్చనా (2)
||యేసయ్య యేసయ్య ||
చరణం :- 3
పరిశుద్ధుడా సారధివై
నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన
ప్రతి మలుపు నీ చిత్తమే
నా విశ్వాసము నీ పైనుంచి
విజయము నే చాటనా (2)
నా ప్రతిక్షణము ఈ భావనతో
గురి యొద్దకే సాగెదా (2)