Idhi rakshana krupakaalam

ఇది రక్షణ కృపకాలం

ఇది రక్షణ కృపకాలం
ప్రభు త్వరగా రా సమయం
ఇక ఆలస్యం లేదిక
మనస్సు మార్చుకోనీవిక (2)

1.రాజ్యముల రాజ్యముల్
జనములపై జనములు
ఎటుచూచిన మరణముల్
ఎటుకేగిన యుద్దముల్

||ఇది||

2.దేశమంతా క్షామమే
జగమంతా అశాంతియే
శ్రమకాలం మొదలాయే
యుగసమాప్తి సమీపించే

||ఇది||

3.అంత్య క్రీస్తుపాలన-
అతి శీఘ్రమే రానుండే
విశ్వాసులకు నిందలు
భక్తులకు హింసలు

||ఇది||

4.క్రైస్తవుడా మేలుకో
సోదరుడా స్థిరపడు
నిర్లక్ష్యముగా నుండకు
ఆత్మయందే బలపడు

||ఇది||