Hrudayamanedi thalupu Nodda

హృదయమనెడు తలుపు నొద్ద

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి– సదయుడగుచు దట్టుచుండు
– సకల విధములను (2)

||హృదయ||

పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ
స్నేహితుడు (2)

||హృదయ||

కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము
న్యాయంబు (2)

||హృదయ||

ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా –
డిప్పుడు మిమ్ములను (2)

||హృదయ||

అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల
పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు
ప్రియుడగును (2)

||హృదయ||

జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి –
యనిశము కనిపెట్టు (2)

||హృదయ||

సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ
రక్షించు (2)

||హృదయ||

చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ
యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర
జీవము కృపను (2)

||హృదయ||

అతడు తప్పక కలుగజేయు – నఖిల
భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు –
డానందము తోడ (2)

||హృదయ||

బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని
గొలువండి (2)

||హృదయ||