Halleluya patalatho

హల్లెలూయ పాటలతో

హల్లెలూయ పాటలతో
ఆనంద గీతాలతో (2)

కృపామయుండా నీ మేలులన్ని
స్మరించి స్తుతింతును (2)

నేనారణ్యా యానములో
నిను పలుమార్లు విసిగించినా (2)

కోపించుచునే వాత్సల్యము చూపి
అనుదినము నను మరువక
మన్నాను నాకిడితివి (2)

||హల్లెలూయ||

మలినంబైన వలువలతో
నే నీ ఎదుట నిలుచుండగా (2)

కృపతో నా నేరములను క్షమియించి
పరిశుద్ధ వస్త్రములతో
నన్నలంకరించితివి (2)

||హల్లెలూయ||

నే కృంగిన వేళలలో
నీ అభిషేక తైలముచే (2)

పక్షిరాజు యవ్వనము వలె నా బలము
నూతనము జేసితివి
నను పైకెగుర జేసితివి (2)

||హల్లెలూయ||