Gurthuchesuko Manasa

గుర్తుచేసుకో మనసా

గుర్తుచేసుకో మనసా – గుండెలోన దాచుకో
గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు
గుర్తు చేసుకో మనసా – గుండెలోన దాచుకో

1. దారి తెన్ను తెలియకనే తిరిగిన దినములను
దారుణమైన వేదనను పొందిన క్షణములను
దాపుచేరి యేసు నిన్ను ఓదార్చిన తరుణమును
దయ చూపి నీ బాధను తొలగించిన సమయమును

॥గుర్తు చేసుకో॥

2. ఊపిరి సలుపని శోధనలో కృంగిన వేళలను
బ్రతుకే చేదై మరణమును వెదకిన వైనమును
ఎవరు లేని నిశిధిలోన యేసు ప్రేమ కలయికను
ఏనాటికి మారిపోని క్రీస్తుని మమకారమును

॥గుర్తు చేసుకో॥

3. ఇంతకాలము కాచినవాడు – ఇక నిను మరిచేన
ఇంతవరకు నడిపించినవాడు – ఇప్పుడు వీడేన
అనురాగం పంచినవాడు-
అన్యాయం చేసేనా
ప్రాణము బలిపెట్టినవాడు – ప్రేమించుట మానేన

॥గుర్తు చేసుకో॥