Golgothu Kondapaina

గోల్గోతా కొండపైనా

గోల్గోతా కొండపైనా నీ కొరకూ నా కొరకూ
కన్నీరు కార్చింది ప్రేమా కడగళ్ళ నోర్చింది ప్రేమా

॥గొల్గోతా॥

1. గెత్సమనే తోటలో దుఖ:పడినదీ
కడువేదనతో చెమటే రక్తమైనదీ
కన్నీళ్ళతో తండ్రిని వేడుకొన్నది.
ప్రాణాలను బలిచేయ సిద్ధపడినది
వధకు తేబడిన గొర్రెవోలే – తన శిరము వంచుకున్నది
నీ కొరకూ, నా కొరకూ మన కొరకూ
మనందరి కొరకూ

॥గొల్గోతా॥

2. అపరాధిగ తాను ఎంచబడినది అన్యాయపు తీర్పును పొందియున్నది
అరచేతుల దెబ్బలు తాను తిన్నది
తన దేహం సాళ్ళవలె దున్నబడినది
మనుషులెవరు చూడనొల్లనీ రూపముగా మార్చబడినది
నీ కొరకూ, నా కొరకూ మన కొరకూ మనందరి కొరకూ

॥గొల్గోతా॥