Gathakaalamantha Kaachithivi

గతకాలమంత కాచితివి

గతకాలమంత – కాచితివి
నీ రెక్కల – చాటు దాచితివి
జయమైతివి విజయమైతివి నా జయధ్వజమైతివి
యేసయ్యా నా యేసయ్యా

1. నీకు విరోధమై నిలిచిన దేది
వర్ధిల్లదుయని మాట ఇచ్చితివి
అన్నివేళల ఆశ్రయపురమై
అడుగడుగున నను కాపాడుచుంటివి

||జయమైతివి॥

2. నీ దుఃఖమును సంతోషముగా
మార్చెదనుయని ఓదార్చితివి
అవమానాలన్ని శాశ్వత ఘనతగా
చేసెదనని నను ధైర్యపరచితివి

||జయమైతివి॥