Gaganamu Cheelchukoni

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్న
ప్రాణప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని…
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2)
ఉల్లసించుచున్నది…  

||గగనము||

నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2)
పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను (2)
నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) 

||గగనము||

నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2)
కళంకములేని వధువునై – నిరీక్షణతో నిన్ను చేరెదను (2)
యుగయుగాలు నీతో ఏలెదను (2) 

||గగనము||

నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2)

అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో (2)

సీయోనులో నీతో నేనుందును (2)

||గగనము||