Entha Madhuramu

ఎంత మధురము యేసుని ప్రేమ

ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2)

||ఎంత మధురము||

అంధకార బంధము నన్నావరించగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2)

|| ప్రేమా ||

రక్షించు వారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2)

|| ప్రేమా ||