Entha Jaali Yesuvaa

ఎంత జాలి యేసువా

ఎంత జాలి యేసువా
యింతయని యూహించలేను

|| ఎంత ||

హానికరుడ హింసకుడను
దేవదూషకుడను నేను (2)
అవిశ్వాసినైన నన్ను (2)
ఆదరించినావుగా

|| ఎంత ||

రక్షకుండ నాకు బదులు
శిక్ష ననుభవించినావు (2)
సిలువయందు సొమ్మసిల్లి (2)
చావొందితివి నాకై

|| ఎంత ||

ఏమి నీ కర్పించగలను
ఏమి లేమి వాడనయ్యా (2)
రక్షణంపు పాత్రనెత్తి (2)
స్తొత్రమంచు పాడెద

|| ఎంత ||

నీదు నామమునకు యిలలో
భయపడెడు వారి కొరకై (2)
నాథుడా నీ విచ్చు మేలు (2)
ఎంత గొప్పదేసువా

|| ఎంత ||

నేను బ్రతుకు దినములన్ని
క్షేమమెల్ల వేళలందు (2)
నిశ్చయముగ నీవు నాకు (2)
ఇచ్చువాడా ప్రభువా

|| ఎంత ||

నాదు ప్రాణమునకు ప్రభువా
సేద దీర్చు వాడ వీవు (2)
నాదు కాపరివి నీవు (2)
నాకు లేమి లేదుగా

|| ఎంత ||

అందరిలో అతి శ్రేష్ఠుండా
అద్వితీయుడగు యేసయ్యా (2)
హల్లెలూయ స్తోత్రములను (2)
హర్షముతో పాడెద

|| ఎంత ||