Entha Dooramainaa
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2)
యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2)
తీరానికి చేరు (2)
|| ఎంత ||
నడచి నడచి అలసిపోయినావా
నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2)
కలువరి గిరి దనుక సిలువ మోసిన
నజరేయుడేసు నీ ముందు నడవగా (2)
|| యేసు ||
తెలిసి తెలిసి జారిపోయినావా
తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2)
నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే
పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2)