Entha Cheppina
ఎంత చెప్పిన వాక్యమినక పోతివి
ఎంత చెప్పిన వాక్యమినక పోతివి
సాగిపోతివా చింతతో సమాధికి
వాదమాడి.. పంతమాడి (2)
అంతలోనే కన్ను మూసి పోతివా (2)
ధనము ధాన్యము కూడబెట్టి
మేడ మిద్దెలు కట్టబెట్టి (2)
అంత విడచి ఒంటిగానే పోతివా
ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా (2)
|| ఎంత ||
కొండలాంటి అండ బలమును
చూచి ఎంతో అదిరి పడితిని (2)
కండ బలము కరిగిపోయే
నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా (2)