Ekkadekkado Putti

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2)
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం – (2)

ఒంటరి బ్రతుకును విడిచెదరు
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)
పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో

||దేవుని||

గత కాల కీడంతా మరచెదరు
వీనులతో సంతసించెదరు (2)
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో

||దేవుని||

ఫలియించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు (2)

పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో

||దేవుని||