Ee Dinamentho

ఈ దినమెంతో శుభ దినము

ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం

||ఈ దినమెంతో||

నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)

యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం

||ఈ దినమెంతో||

జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం

||ఈ దినమెంతో||