Digulu padaku bhayapadaku

దిగులు పడకు భయపడకు

దిగులు పడకు భయపడకు చెల్లెమ్మా
చెల్లెమ్మ నా చెల్లెమ్మ
నా చెల్లెమ్మా చెల్లెమ్మా – ఓ చెల్లెమ్మా
దిక్కులేని దాననని – నిలువనీడ లేనే లేదనీ
దిక్కెవరు నాకు ఉన్నారని ……..

||దిగులు||

కట్టుకున్న వాడేమో – కాలయముడని
కన్న బిడ్డలను నేను పోషించలేనని (2)
కాటి కెళ్ళి పోవాలని – కన్నీళ్ళూ విడుచుచు
మరణాన్ని నీవు వెతకొద్దె చెల్లెలా(2)
విత్తని పక్షులను పోషించే యేసయ్యా
నీ బ్రతుకు బండిని యేసయ్య నడుపును(2)

నీకున్న ఆధారం – నీ పెనిమిటి
నిన్ను విడచి వెళ్ళి పోయాడా(2)
గుప్పెడంత గుండెకు కొండంత గాయమై
లోకమంతా నీకు చీకటాయెనా(2)
ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను హత్తుకొని
కన్న తండ్రిలా నిన్ను చూచుకుంటాడు(2)

ఆడజన్మ నాకెందుకు వచ్చిందని
తలచి వగచి నీవు కృంగుచుంటివా(2)
వేదనతో నీవు సోకించుచూ
మనసంతా నీకు ముక్క చెక్కలాయెనా(2)
నిను పుట్టించిన నా యేసయ్యా
కడవరకు నీతో ఉండును(2)

సృష్టిలోన స్త్రీ జన్మ విలువైనది
స్త్రీ నుండి లోకానికి సృష్టికర్త వచ్చెను(2)
ప్రాణంపెట్టి పాపులకై మరణించిన యేసు
తిరిగి లేచి మొదట స్త్రీకే కనిపించెను(2)
రక్తమిచ్చి కొన్న తన సంఘానికి
వధువు సంఘము అని పిలిచాడమ్మ