Devuni Yandu Bhakthi

దేవుని యందు భక్తి గల స్త్రీ

దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును
ఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును

||దేవుని||

ప్రార్ధన చేసి వీర వనితగా
ఫలమును పొంది ఘనత పొందెను
హన్నా వలె నీవు
ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా

||దేవుని||

ప్రభు పాదములు ఆశ్రయించి
ఉత్తమమైనది కోరుకున్నది
మరియ వలె నీవు
ప్రభు సన్నిధిని కోరెదవా

||దేవుని||

వినయ విధేయతలే సుగుణములై
తన జనమును రక్షించిన వనిత
ఎస్తేరును బోలి
దీక్షను పూణెదవా ఉపవసించెదవా

||దేవుని||