Devuni Preminchuvariki

దేవుని ప్రేమించువారికి

దేవుని ప్రేమించువారికి – తన సంకల్పము చొప్పున
పిలువబడిన వారికి మేలు – కోసమే సమస్తము
సమకూడి జరుగుచున్నది

1. అనుకున్నది జరుగదని కలత చెందకు
అనుకోనిది జరిగిందని దిగులునొందకు
మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము

ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము

||దేవుని॥

2. మనము కోరు సంతోషం అల్పకాలము

దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము
మన దగ్గర వున్నది కొద్ది జ్ఞానము
మన దేవుడు కలిగున్నది మహాజ్ఞానము
యేసుని క్రియలన్ని మన మంచి కోసమే

||దేవుని॥