Devara Nee Deevenalu

దేవర నీ దీవెనలు

దేవర నీ దీవెనలు
ధారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను (2)

దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు
సహింపున వీరు సుఖించుటకై

|| దేవర నీ ||

ఈ కవను నీ కరుణన్
ఆకరు వరకును లోకములో
శోకము లేకయే ఏకముగా
బ్రాకటముగను జేకొనుము

|| దేవర నీ ||

ఇప్పగిది నెప్పుడును
గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్

|| దేవర నీ ||

తాపములు పాపములు
మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి
యాపదలన్నియు బాపుచును

|| దేవర నీ ||

సాధులుగన్ జేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ
పాదము దాపున బాదుకొనన్

|| దేవర నీ ||

మెండుగ భూమండలపు
గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండనుండి
వెండియు వానిని ఖండించావే

|| దేవర నీ ||

యిద్దరు వీరిద్దరును
శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్
దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్

|| దేవర నీ ||

వాసిగ నీ దాసులము
చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడ
యేసుని పేరిట బ్రోవుమామేన్

|| దేవర నీ ||