Devaa Mahonnathudaa
దేవా మహోన్నతుడా
దేవా మహోన్నతుడా
మహిమా ప్రకాశితుడా (2)
పదివేలలో అతి సుందరుడా
కీర్తింతు మనసారా (2)
|| దేవా ||
వెలిసావు భువిలో మెస్సయ్యగా
ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2)
నిస్సారమైన నా జీవితములో
చిగురించె ఆనందము (2)
|| దేవా ||
లేచాను ఒంటరి విశ్వాసినై
వెదికాను నీ దారి అన్వేషినై (2)
నీ దివ్య మార్గము దర్శించినా
ఫలియించె నా జన్మము (2)