Deva Naadevudavu Neevebani

దేవా నా దేవుడవు నీవేనని

దేవా నా దేవుడవు నీవేనని
నా మదినేలే రారాజువు నీవేనని
ఆరాధనే చెయ్యనా – ఆనందమే పొందనా

1. కెరూబులు సెరాపులు మహాదూతలు
నిత్యము నిన్ను స్తుతియింపగను
ఎన్నిక లేని నా స్తుతికోసము
మిగుల ఆశతో చూచుచుంటివా

॥ ఆరాధనే||

2. ప్రతి దినము నీ యొద్దకు ఆకర్షించి
ప్రభువా నిను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి
ప్రతిచోట నీకై జ్యోతిగ నిలిపీ
పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా

॥ ఆరాధనే||