Deva Deva
దేవా.... దేవా....
దేవా…. దేవా….
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము
నీవే నా గమ్యము – నిన్ను చేరేదను
|| దేవా ||
1. నన్ను తలచి – నన్ను వలచి
నాలో నిలచి – నాతో నడచి
వింతైన అనుభవములు నాకు చూపి
విలువైన పాత్రగ నను మలచిన
|| దేవా ||
2. నిన్ను తాకి పరవశించి
పాడుకుంటాను పరమగీతం
నీ సొంతమే ఇక నా జీవితం
నీ సేవయే ఇల నా దర్శనం