Deevinchu Maa Thandri

దీవించు మా తండ్రి మా భారత దేశాన్ని

దీవించు మా తండ్రి మా భారత దేశాన్ని
రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని
నలిగిపోతున్న నా ప్రజను నశియించుచున్న ఆత్మలను

||దీవించు||

1. మద్యపానమే మనిషి ప్రాణమును బలిచేయుచున్నది.
ఆలుబిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది

మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది.
అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది
అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి

||దీవించు||

2. అశ్లీల చిత్రపు ఆగడాలు మితిమీరుచున్నవి.

మనుషులలో దుష్కామవాంఛను రగిలించుచున్నవి.
హేయమైన బహుఘోర పాపముకు తెరతీయుచున్నది
అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది.
అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి

||దీవించు||

3. మతాల పేరిట మారణ హోమం కొనసాగుచున్నది.
సమతా మమతలమాటె మనిషిలో మరుగవుచున్నది.
రాక్షసత్వమే మనిషితత్వమై అలరారుచున్నది.
ప్రేమతత్వమే పనికిరానిదని తలపోయుచున్నది.
రాక్షసత్వమును తొలగించి ప్రేమతత్వమును ప్రబలించి

||దీవించు||