Daveedu Kumaaruda

దావీదు కుమారుడా నను దాటిపొకయా

దావీదు కుమారుడా – నను దాటిపొకయా
నజరేతువాడా – నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

1. గ్రుడ్డి వాడినయ్యా – నా కనులు తెరువవా
మూగవాడినయ్యా – నా స్వరము నియ్యవా
కుంటి వాడినయ్య – నా తోడు నడువవా
దావీదు కుమారుడా – నను దాటిపొకయా

నజరేతువాడా – నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

2. లోకమంత చూసి – నను ఏడిపించినా
జాలితో నన్ను – నీవు చేరదీయవా
ఒంటరి నయ్యా – నాతోడు నిలువవా
దావీదు కుమారుడా – నను దాటిపొకయా
నజరేతువాడా – నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

3. నా తల్లి నన్ను – మరచిపోయిన
నా తండ్రి నన్ను – విడిచిపోయిన
తల్లితండ్రి నీవై నను లాలించుమా
దావీదు కుమారుడా – నను దాటిపొకయా
నజరేతువాడా – నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా