Daivamaa Neeku Sthotramu
దైవమా నీకు స్తోత్రము
దైవమా నీకు స్తోత్రము నీ త్యాగమే అంతులేనిది (2)
కలువరి గిరిలో మా కలుషము బాప
కరిగి తరిగి నలిగిన నా యేసయ్య (2)
||దైవమా||
మహిమను విడచి మనిషిగా మారావు
దాసుని రూపంలో ధరణిపై నడిచావు (2)
భాగ్యవంతుడా నా యేసయ్య
అభాగ్యులను దీవించ అవనిపైకి తిరిగొచ్చావు
||దైవమా||
తీర్పరివైన నీవు తీర్పులోన నిలిచావు
దోషులైన మాకై దోషిగా మారావు (2)
త్యాగశీలుడా మా యేసయ్యా
మా దోషములు భరియించి తీర్పు నుండి తప్పించావు
||దైవమా||
మరణమే లేని నీవు మరణశిక్ష భరియించావు
మృత్యువునే జయించి మహిమను పొందావు (2)
నిత్యజీవమా నా యేసయ్య
నీ మంచినంత మాకు పంచి మహిమ రాజ్యమిచ్చావు
||దైవమా||
కలువరి గిరిలో మా కలుషము బాప
కరిగి తరిగి నలిగిన నా యేసయ్య (2)