Chudare Kreesthuni

చూడరే క్రీస్తుని జూడరే

చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే
చూడరే నాముక్తి పదవికి ఱేఁడు యేదశఁ గూడినాఁడో

||చూడరే||

1. మించి పొంతి పిలాతు సత్య మొ కించుకైనఁ దలంప కక్కట వంచనను
గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప గించెనా మేలు గ
ణించెనా ఇతనిఁ గాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది

||చూడరే||

2. మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండఁగ నంటఁ
గొట్టఁగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్నుఁ గాంచెనా యిది
మది నెంచెనా హా నా కంట నే నిటువంటి యాపదఁ గంటిఁ
బ్రాణము లుండునే యిఁకఁ

||చూడరే||

3. ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపుఁ బ్రక్కపోటు మాటిమాటికిఁ
జూడ దుఃఖము మరలునే తలమీఁద ముళ్లకి రీటమా యితనికి
వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగఁ
జేసిరి

||చూడరే||