Chuche Kanuleeyumaa

చూచే కనులీయుమా నా యేసయ్యా

చూచే కనులీయుమా నా యేసయ్యా
చూచే కనులీయుమా
సర్వాంగ సుందర నీ రూపము
కనులారా గాంచి తరియింపగా నిన్ను

॥చూచే||

1. చల్లని వేళా ఏదేను తోటలో
ఆదాము చూచిన నీ రూపము
సింధూర వనములో అబ్రహామును దర్శించినా

దేవ నీ రూపము కనులార గాంచి
తరియింపగా నిన్ను

॥చూచే||

2. అల యాకోబుతో పెనుగులాడి
దీవించినా దేవ నీ రూపము
మండు పొదలో మోషేను పిలిచినా
నాదేవ దేవా నీ రూపము
కనులార గాంచి తరియింపగ నన్ను

॥చూచే||