Chinni Manasutho

చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును

చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును
చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2)
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2)
నీవే నా ధ్యానము (2)        

||చిన్ని||

తండ్రి మాటను ధిక్కరించక
తలవంచిన ఇస్సాకు వలే (2)
విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2)
వినయముగల మనసివ్వుము (2)        

||చిన్ని||