Chemmagillu kallalona
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
కష్టాల బాటలోనె సాగదు పయనం
విడుదల సమీపించెను నీకు వెలుగు
ఉదయించును
నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ
ప్రభువు యిచ్చునులె
నీవు పొందిన వేదనలన్ని – త్వరలో
తీరిపోవునులె
నీ స్థితి చూసి నవ్వినవారే – సిగ్గుపడే
దినమొచ్చేనులే
విడుదల సమీపించెను నీకు వెలుగు
ఉదయించును
అనుభవించిన లేమి బాధలు – ఇకపై నీకు
వుండవులే
అక్కరలోన ఉన్నవారికి – నీవే మేలు చేసే వులే
మొదట నీ స్థితి కోంచమె ఉన్న – తుదకు
వృద్ధిని పొందునులే
విడుదల సమీపించెను నీకు వెలుగు
ఉదయించును