Banda sanduna pavurama

బండ సందున పావురమా

బండ సందున పావురమా - 
పేటు బీటుల పావురమా
ప్రియుడు నిన్ను కోరినాడు - 
భీతి చెందకుమా వరుడు నిన్ను కోరినాడు -
కలత చెందకుమా

సిద్ధపడుమా - ఓ సంఘమా - 
క్రీస్తు వచ్చు వేళాయే - 
వేచి యుండుమా - 
యేసువచ్చు వేళాయే - 
లేచి యుండుమా 

ప్రియుడు నిన్ను కోరెను - 
నీ వరుడు నిన్ను కోరెను - 
నీ స్వరము వినిపించుమా - 
నీ ముఖము చూపించుమా 
ఏసు రాజు దిగువచ్చు వేళ - 
నీవు సంసిద్ధమా - 
నీవు పరిశుద్దమా

కొండ పేటు లందున - 
బండ బీటులందున - 
నీగూడు నిర్మింపుమా - 
నీ ప్రియునికై చూడుమా 
లోక ఆశలు నీకేలనమ్మా - 
సిద్దె వెలిగించుమా - 
సిద్ధముగ నుండుమా

సాగరాలు పొంగినా - 
నింగి నేల కూలినా - 
భయమేల ఓ సంఘమా - 
దిగులేల ప్రియ సంఘమా - 
బండ క్రీస్తే నీ యండనుండ - 
గీతములు పాడుమా - 
నీ ప్రియుని వీక్షింపుమా

ద్రాక్ష చెట్లు పూత పట్టి - 
వాసన నిచ్చుచున్నవి - 
చలికాలమే గడిచెనమ్మా నిదురేల నీ వింకలెమ్మ - 
వరుడు యేసు దిగివచ్చు వేళ తరుణమే తెంచెనమ్మా - 
నీ ప్రియుని సంధించుమా