Baala Yesuni Janma Dinam

బాల యేసుని జన్మ దినం

బాల యేసుని జన్మ దినం
వేడుకైన శుభ దినము
సేవింప రారే జనులారా
ముద్దుల బాలకు ముద్దులిడ

||బాల||

మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని
చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2)
చేకొని లాలింప రారే
జో జోల పాటలు పాడి

||బాల||

పాపికి పరమ మార్గము జూప
ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2)
పశుశాలయందు పవళించే
తమ ప్రేమను జూపింప మనకు

||బాల||

మన జోల పాటలు ఆలించు బాలుడు
దేవాది దేవుని తనయుడు గనుక (2)
వరముల నొసగి మనకు
దేవుని ప్రియులుగా జేయు

||బాల||