Arpana Bali Arpana
అర్పణ బలిఅర్పణ
అర్పణ బలిఅర్పణ
యేసు నాకొరకు చేసిన ప్రేమార్పణ
అర్పణ బలిఅర్పణ
యేసు నాకొరకు చేసిన ప్రాణార్పణ (2)
రక్తమే ప్రాణము – ఆ ప్రాణమే దారబోసెను (2)
ఇంత గొప్ప ప్రేమ యేసు నాపై చూపెను
ఎంతో శాశ్వతమైన కృపతో నన్ను నింపెను (2)
ఏమివ్వగలను యీ ప్రేమకు
ఏమర్పించగలను నీ ప్రేమకు (2)
యేసుని స్వరూపాన్ని లోకానికి నే యిత్తును
ప్రాణార్పణంగా క్రీస్తు కొరకే నే బ్రతికెద (2)
||అర్పణ ||
హృదయమే మోసమైనది ఆ వ్యాధినే కడిగివేసెను (2)
ఇంత గొప్ప నెమ్మది యేసు లోకానికిచ్చెను
ఎంతో నూతన సృష్టిగా రూపాంతర పరిచెను (2)
ఏమివ్వగలను యీ ప్రేమకు
ఏమర్పించగలను నీ ప్రేమకు (2)
విరిగి నలిగిన హృదిని నే యిత్తును
కడవరకు క్రీస్తు కొరకె నే నిలిచెద (2)
||అర్పణ ||