Agni Mandinchu

అగ్ని మండించు

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)

పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)

అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)

ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)      

||అగ్ని||

అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)

ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)      

||అగ్ని||

అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)

నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)      

||అగ్ని||

ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)

నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)      

||అగ్ని||