Randi Usthahinchi paadudamu

రండి ఉత్సాహించి పాడుదము

రండి ఉత్సాహించి పాడుదము

రక్షణ దుర్గము మన ప్రభువే (2)

రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము (2)
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోష గానము చేయుదము

||రండి||

మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యము గల రాజు (2)
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే

||రండి||

సముద్రము సృష్టించెనాయనదే
సత్యుని హస్తమే భువిజేసెన్ (2)
ఆయన దైవము పాలితుల
ఆయన మేపెడి గొర్రెలము

||రండి||

ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము (2)
ఆయన మాటలు గైకొనిన
అయ్యవి మనకెంతో మేలగును

||రండి||

తండ్రి కుమార శుద్దాత్మకును
తగు స్తుతి మహిమలు కల్గు గాక (2)
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ
అయినట్లు యుగములనౌను ఆమెన్

||రండి||