Yesu Rakthamu Rakthamu

యేసు రక్తము రక్తము రక్తము

యేసు రక్తము రక్తము రక్తము (2)
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము

||యేసు రక్తము||

ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము (2)
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే (2)     

||యేసు రక్తము||

మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను (2)     

||యేసు రక్తము||

మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము (2)
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను (2)     

||యేసు రక్తము||