Yesu Goriya Pillanu Nenu

యేసు గొరియ పిల్లను నేను

యేసు గొరియ పిల్లను నేను

వధకు తేబడిన గొరియ పిల్లను (2)

దినదినము చనిపోవుచున్నాను

యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2)

||యేసు గొరియ||

నా తలపై ముళ్ళు గుచ్చబడినవి

నా తలంపులు ఏడుస్తున్నవి (2)

నా మోమున ఉమ్మి వేయబడినది

నా చూపులు తల దించుకున్నవి (2)

||యేసు గొరియ||

నా చేతుల సంకెళ్ళు పడినవి

నా రాతలు చెరిగిపోతున్నవి (2)

నా కాళ్ళకు మేకులు దిగబడినవి

నా నడకలు రక్త సిక్తమైనవి (2)

||యేసు గొరియ||