Yesayya Naamamu
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)
నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను (2)
||యేసయ్య||
రోగ భయం – మరణ భయం
తొలగిపోవును యేసు నామములో (2)
||యేసయ్య||
అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు (2)
||యేసయ్య||
పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును (2)
||యేసయ్య||
యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము (2)
||యేసయ్య||