Yesayyaa Nee Poola Thota

యేసయ్యా నీ పూల తోట

యేసయ్యా నీ పూల తోట
పుష్పించ లేదెందు చేత – (2)
రకరకాల విత్తనాల
ప్రేమ మీద చల్లినావు (2)
మోసులెత్తినా – చిగురాకు లేచినా
పూవులెందుకు పూయలేదు
ఫలమెందుకు పండలేదు       

||యేసయ్యా||

సంఘాల స్థాపించినావు
సదుపాయములిచ్చినావు (2)
సంఘమెదిగినా – సంఖ్య పెరిగినా (2)
సాంగత్య ప్రశాంతి లేదు
సౌరభ్యము నిండలేదు       

||యేసయ్యా||

స్వార్ధ రహితుల కాపు లేదు
ఆత్మ జీవికి పెంపు లేదు (2)
సేవ చేసినా – సువార్త సాగినా (2)
పూలెందుకు పూయలేదు (2)
ఫలమెందుకు పండలేదు       

||యేసయ్యా||