Yesayyaa Nannenduku

యేసయ్యా.. నన్నెందుకు

యేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా
తెలుపుము నీ చిత్తము నా యెడల – (2)     

||యేసయ్యా||

ఏ దరి కానక తిరిగిన నన్ను
నీ కౌగిటిలో చేర్చుకున్నావయ్యా (2)
ఏమి నీ ప్రేమా – ఏమి నీ కృప నా యెడల (2)
ఏమి నీ కృప నా యెడల       

||యేసయ్యా||

చనిపోయిన స్థితిలో పడిపోయిన నన్ను
నీ జీవము నొసగి బ్రతికించావయ్యా (2)
ఏమి నీ దాక్షిణ్యం – ఏమి నీ దయ నా యెడల (2)
ఏమి నీ దయ నా యెడల       

||యేసయ్యా||

శోధనా బాధలో కృంగిన నన్ను
నిరీక్షణ నొసగి బలపరచావయ్యా (2)
ఏమి నీ ఆదరణ – ఏమి నీ ఆశ నా యెడల (2)
ఏమి నీ ఆశ నా యెడల       

||యేసయ్యా||