Yesanna Swaramannaa

యేసన్న స్వరమన్నా

యేసన్న స్వరమన్నా
నీవెప్పుడైనా విన్నావా (2)       

||యేసన్న||

ఏదేను తోటలో ఆదాము చెడగా
ఆ దేవుడే పిలిచె (2)
యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2)
అటులనే నీవును దాగెదవా (2)       

||యేసన్న||

జనముల శబ్దము జలముల శబ్దము
బలమైన ఉరుములతో (2)
కలిసిన స్వరము పిలిచిన యేసు (2)
పిలిచిన పిలుపును నీవింటివా (2)       

||యేసన్న||

ఆనాడు దేవుడు మోషేను పిలువగా
ఆలకించెను స్వరము (2)
ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2)
కానాను చేరగా కదిలి రావా (2)       

||యేసన్న||