Yugayugaalu Maariponidhi

యుగయుగాలు మారిపోనిది

యుగయుగాలు మారిపోనిది

తరతరాలు తరిగిపోనిది

ప్రియ యేసు రాజు నీ ప్రేమా

నిను ఎన్నడు వీడిపోనిది

నీకు ఎవ్వరు చూపలేనిది

ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది

హద్దే లేని ఆ దివ్య ప్రేమతో

కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో

నీ కోసమే బలి అయిన దైవము రా (2)

 

లోకంతో స్నేహమొద్దు రా

చివరికి చింతే మిగులు రా

పాపానికి లొంగిపోకు రా

అది మరణ త్రోవ రా (2)

నీ దేహం దేవాలయము రా

నీ హృదయం క్రీస్తుకి కొలవురా (2)

||హద్దే||

తను చేసిన మేలు ఎట్టిదో

యోచించి కళ్ళు తెరువరా

జీవమునకు పోవు మార్గము

క్రీస్తేసుని ఆలకించారా (2)

నీ ముందర పందెము చూడరా

విశ్వాసపు పరుగులో సాగరా (2)

||హద్దే||