Yavvanaa Janamaa

యవ్వనా జనమా

యవ్వనా జనమా

ప్రభు యేసులో త్వరపడుమా (2)

సమర్పించుము నీ యవ్వనము (2)

ప్రభు యేసుని పాదములో (2)

||యవ్వనా||

యవ్వనమనునది విలువైనది

కదలిపోతే తిరిగి రాదు

యవ్వనమందే మన కర్తను

స్మరించుమూ కీర్తించుమూ

ప్రభు యేసులో జీవమును పొందుమూ

||యవ్వనా||

ఈ లోకము వైపు మనసు ఉంచకు

క్షనికమైనదీ దాని మెరుపులు

నీ మనసా వాచా క్రియలందును

ప్రభు యేసును మది నిలుపుకో

పరలోకపు ఆనందమును పొందుమూ

||యవ్వనా||