Maatlade Devudavu Neevu

మాట్లాడే దేవుడవు నీవు

మాట్లాడే దేవుడవు నీవు
మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2)
మాట్లాడే దేవుడవు నీవు
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

||మాట్లాడే||

నా ఇంటి వైద్యుడవు నీవు
నా మంచి ఔషధము నీవు (2)
నా వ్యాధి బలహీన సమయాలలోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2)

||యేసయ్యా||

నా కోసం వచ్చావు నీవు
కన్నీరు తుడిచావు నీవు (2)
అన్నీ ముగించి సీయోనులోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2)

||యేసయ్యా||