Bheekarundou maa Yehova

భీకరుండౌ మా యెహోవా

భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే

||భీకరుండౌ||

మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము

|| భీకరుండౌ ||

ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము

|| భీకరుండౌ ||

పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని

|| భీకరుండౌ ||

మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను

|| భీకరుండౌ ||

మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను

|| భీకరుండౌ ||