Nee Dhanamu Neeghanamu

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా

||నీ ధనము||

ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా (2)
పరలోక నాధుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా

||నీ ధనము||

పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా

||నీ ధనము||

వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)
వెలిగించ ధర పైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభున కర్పింపవా

||నీ ధనము||

కలిగించె సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంబులు (2)
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా

||నీ ధనము||