Nee chethilo Rottenu Nenayya

నీ చేతిలో రొట్టెను నేనయ్య

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2)

||నీ చేతిలో||

తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2)

||నీ చేతిలో||

అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2)

||నీ చేతిలో||

హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2)

||నీ చేతిలో||