Devude nakasrayambu

దేవుడే నాకాశ్రయంబు

దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ

||దేవుడే||

పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్

||అభయ||

దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు

||అభయ||

రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును

||అభయ||

విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే

||అభయ||

పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును

||అభయ||

కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ

||అభయ||