Aadhaaram Neevenayyaa
ఆధారం నీవేనయ్యా (మెడ్లి)
ఆధారం నీవేనయ్యా
నాకు ఆధారం నీవేనయ్యా (2)
కాలము మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా (2) నా దేవా
||ఆధారం||
నీ దీప స్థంభమై నేను
జీవించ చిరకాల ఆశ (2)
నీ దరికి చేరి నను నీకర్పించి
సాక్షిగ జీవింతును (2)
||ఆధారం||
నీ రాయబారినై నేను
ధైర్యంగా జీవించ ఆశ (2)
నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ
నిను నేను ప్రకటింతును (2)
||ఆధారం||