Aagaka Saagumaa

ఆగక సాగుమా

ఆగక సాగుమా
సేవలో ఓ.. సేవకా

ఆగక సాగుమా
సేవలో సేవకా (2)
ప్రభువిచ్చిన పిలుపును
మరువక మానక (2)        

||ఆగక||

పిలిచినవాడు ప్రభు యేసుడు
ఎంతైనా నమ్మదగినవాడు (2)
విడువడు నిన్ను ఎడబాయడు
నాయకుడుగా నడిపిస్తాడు (2)        

||ఆగక||

తెల్లబారిన పొలములు చూడు
కోత కోయను సిద్ధపడుము (2)
ఆత్మల రక్షణ భారముతో
సిలువనెత్తుకొని సాగుము (2)        

||ఆగక||